: దమ్ముంటే ఆరోపణలు నిరూపించు.. జగన్‌కు లోకేశ్ సవాల్
వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ మంత్రి లోకేశ్ సవాలు విసిరారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను జగన్ నిరూపించాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాల్లో తన పాత్ర ఉందని చేసిన ఆరోపణలను నిరూపించాలని లోకేశ్ సవాలు విసిరారు. ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన జగన్ మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాల్లో లోకేశ్ పాత్ర ఉందని, నిందితులను రక్షించేందుకే చర్యలు చేపట్టేందుకు వెనకాడుతున్నారని ఆరోపించారు. జగన్ ఆరోపణలపై స్పందించిన మంత్రి లోకేశ్ తనపై జగన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని ట్వీట్ చేశారు.