: ఓపెన్ ఎస్సెస్సీ పరీక్షకు హాజరైన ఒకే ఒక్కడు.. విధుల కోసం ఆరుగురు!
ఓపెన్ ఎస్సెస్సీ పరీక్ష రాసేందుకు హాజరైన ఒక్కడి కోసం ఆరుగురు సిబ్బంది విధులు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. జడ్చర్లలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రంలో ఓపెన్ ఎస్సెస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఎకనామిక్స్ పరీక్ష నిర్వహించారు. దీనికి జడ్చర్లకు చెందిన సి.విష్ణుకుమార్ ఒక్కడే హాజరయ్యాడు. దీంతో అతడి కోసం సీఎస్, సీసీ, ఇన్విజిలేటర్, డీఓలతోపాటు వాటర్‌బాయ్, ఓ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించారు. ఈ నెల 29 వరకు జరగనున్న ఈ పరీక్షలకు విష్ణుకుమార్ ఒక్కడే హాజరుకానుండడం విశేషం.