: 'బాహుబలి-2' కోసం ఆరు షోలకు అనుమతా?.. ఉపసంహరించుకోవాలి.. లేదంటే కోర్టుకు వెళతాం: ప్రేక్షకుల సంఘం


భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కించిన బాహుబ‌లి-2 సినిమా కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రోజుకి ఆరు షోలకు అనుమతి ఇవ్వ‌డం ప‌ట్ల ప్రేక్షకుల సంఘం మండిప‌డింది. ఇది చట్ట వ్యతిరేకమని ఆ సంఘం నాయ‌కులు ఈ రోజు ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధకు ఓ విన్నపం చేసుక‌ున్నారు. ఏపీ సర్కారు జారీ చేసిన ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు.

థియేటర్లలో షోల ప్రదర్శన వేళలపై చట్టంలో స్పష్టమైన అంశాలు ఉన్నాయ‌ని, రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 8 గంటల వరకూ ప్రదర్శనలు ఉండరాదని అందులో ఉంద‌ని వారు గుర్తు చేశారు. దీనిపై అనురాధ మాట్లాడుతూ ఈ విష‌యాన్ని స‌ర్కారు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మ‌రోవైపు ఈ అంశంపై స‌ర్కారు స్పందించ‌క‌పోతే కోర్టుకు వెళ్తామ‌ని ప్రేక్షకుల సంఘం తెలిపింది.

  • Loading...

More Telugu News