: 26 మంది జవాన్లు మృతి చెంద‌డాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: రాజ్‌నాథ్ సింగ్‌


చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుకుమా జిల్లాలో ఈ రోజు సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌పై మావోయిస్టులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన జ‌వాన్ల సంఖ్య 26కు చేరింది. ఈ దాడిని కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. హోం శాఖ స‌హాయ మంత్రి హ‌న్స్‌రాజ్ అహిర్‌తో మాట్లాడి, ఛ‌త్తీస్‌గ‌ఢ్ వెళ్లి ప‌రిస్థితిని స్వ‌యంగా స‌మీక్షించాల‌ని ఆదేశించారు. 26 మంది జవాన్లు మృతి చెంద‌డం జీర్ణించుకోలేకపోతున్నాన‌ని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
 
మ‌రోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. జ‌వాన్ల ధైర్యానికి, త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాన‌ని అన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News