: మావోయిస్టుల కాల్పుల్లో 11 మంది జవాన్ల మృతి.. మరో ఏడుగురికి గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తోన్న 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపారు. ఆ ప్రాంతంలో కొద్దిసేపు మావోయిస్టులు, జవాన్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ క్రమంలోనే జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. సీఆర్ పీఎఫ్ జవాన్ల మృతిని బస్తర్ డీఐజీ సుందర్ రాజు ధ్రువీకరించారు. మరోవైపు బుర్కాపాల్-చింతాగుఫా ప్రాంతంలో ఏడుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోందని చెప్పారు.