: సిమెంట్ కంపెనీల యజమానులకు మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్!
ఈ నెల 27వ తేదీ లోగా సిమెంట్ ధరలు తగ్గించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిమెంట్ కంపెనీల యజమానులకు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిమెంట్ కంపెనీల యజమానులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇచ్చిన గడువు లోగా సిమెంట్ ధరలు తగ్గించకుంటే కంపెనీలకు ఇచ్చే రాయితీలు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. సిమెంట్ బస్తాకు కనీసం రూ.60 వరకు తగ్గించాలని, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సిమెంట్ బస్తా రేటు రూ.230కి మించకూడదని అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ నెల 27న తిరిగి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది.