: 'ప్రజారాజ్యం'ను మీ అన్న మంచి రేటుకు అమ్ముకున్నారు... 'జనసేన' పరిస్థితి ఏంటి?: పవన్ పై బీజేపీ విమర్శలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మండిపడ్డారు. దేశం మొత్తాన్ని టీమిండియాలా నడిపిస్తున్న ప్రధాని మోదీపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. జాతీయ సమగ్రత అనేది బీజేపీ ప్రాథమిక సిద్ధాంతమని... ఉత్తరాది, దక్షిణాది అనే తేడా తమ పార్టీకి ఉండదని ఆయన చెప్పారు. మానసిక సమతుల్యత లేకుండా పవన్ మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
రాజకీయాలంటే సినిమా కాదని కృష్ణసాగర్ అన్నారు. సినిమాల్లో మాదిరి ట్విట్టర్లో చిత్ర విచిత్రంగా పోస్టులు పెడుతున్నారంటూ పవన్ ను విమర్శించారు. మీ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, మంచి ధరకు దాన్ని అమ్మేసుకున్నారని... మరి మీ జనసేన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటేనే కేంద్ర ప్రభుత్వాలను విమర్శించాలని... ఇలాంటి కామెంట్లు రాజకీయ నిరుద్యోగతకు నిదర్శనమని అన్నారు.