: కొన్ని సందర్భాల్లో కొందర్ని మెప్పించడానికి స్థాయి దిగిరావాల్సి వస్తుంది: నటి సోనాక్షి సిన్హా


కొన్ని సందర్భాల్లో కొందర్ని మెప్పించడానికి స్థాయి దిగిరావాల్సి వస్తుందని, కానీ అదే సమయంలో స్వాభిమానం కూడా ప్ర‌ధాన‌మ‌న్న‌ విషయం గుర్తుంచుకోవాలని ‘నూర్‌’ చిత్రం ఫేమ్ సోనాక్షి సిన్హా అంటోంది. ఇటీవ‌లే విడుద‌లైన ‘నూర్’ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా సోనాక్షి సిన్హా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సినిమా జయాపజయాలపై తానేమి బాధపడబోన‌ని చెప్పింది. తాను వాస్తవికతను నమ్ముతానని, అందర్ని మెప్పించలేమని త‌న‌ జీవితంలో తొలినాళ్లలోనే నేర్చుకున్నానని తెలిపింది.

అంద‌రినీ మెప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తే అది స‌మయాన్ని వృథా చేయ‌డ‌మే అవుతుంద‌ని సోనాక్షి సిన్హా చెప్పింది. తాను చేసే పనితో తాను ఎంతో సంతోషంగా ఉన్నాన‌ని తెలిపింది. తాను సంతోషంగా ఉన్నప్పుడే ఇతరులను సంతోషపెట్టగలనని వ్యాఖ్యానించింది. కొన్ని విషయాలు అనుకున్నట్టుగా జరగకపోవచ్చని, మరో సినిమాతో ప్రయత్నించి చూడాలని ఆమె పేర్కొంది. త‌న‌ తండ్రి శత్రుఘ్న సిన్హా గెలుపుని, ఓట‌మిని స‌మానంగా చూసేవారని, త‌న తండ్రి లక్షణాలే త‌న‌లోనూ ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News