: నా కొడుకు తప్పులేదు... టోల్ సిబ్బంది నిర్వాకమే: నిమ్మల కిష్టప్ప


కర్ణాటకలోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటనలో తన కుమారుడు అంబరీష్ తప్పేమీ లేదని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, బాగేపల్లి వద్ద సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే అన్యాయాలకు పాల్పడుతుంటారని ఆరోపించారు. ఏపీ ప్రజా ప్రతినిధులంటే వారికి గౌరవం లేదని, ఏపీ వీఐపీలు ఎవరు ఆ దారిలో వెళుతున్నా కావాలనే అడ్డుకుంటారని అన్నారు.

ఇదే విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తనతో పాటు ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు గతంలో ఫిర్యాదులు చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల దగ్గర రౌడీయిజం సర్వసాధారణం అయిపోయిందని, నిర్దేశించిన రుసుముల కన్నా అధికంగా వసూలు చేస్తూ, ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారని నిమ్మల కిష్టప్ప ఆరోపించారు. టోల్ సిబ్బంది అరాచకాలతో సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని, వారి అన్యాయాలకు చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కేసును విచారిస్తున్న పోలీసులకు తాను సహకరిస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News