: విమానాన్ని ఢీకొన్న పక్షి... పాడైపోయిన ఇంజిన్‌


ఈ రోజు ఢిల్లీ నుంచి కోల్‌కతా వెళుతున్న బోయింగ్‌ 787-8 ఎయిర్‌ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్ట‌డంతో ఆందోళ‌న‌కర ప‌రిస్థితి త‌లెత్తింది. ఈ ఘ‌ట‌న‌తో ఆ విమానం ఇంజిన్‌ పాడైపోయింది. వెంట‌నే డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంతో వ్య‌వ‌హ‌రించి విమానాన్ని అత్యవసరంగా దించడంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. కోల్‌కతా విమానాశ్రయంలో ఆ విమానాన్ని పైల‌ట్‌ జాగ్ర‌త్త‌గా ల్యాండ్ చేశాడ‌ని విమానాశ్ర‌య అధికారులు పేర్కొన్నారు. ఆ విమానంలో మొత్తం 254 మంది ప్రయాణికులు ఉన్నార‌ని, అంద‌రూ క్షేమంగా ఉన్నార‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News