: అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇప్పటికి మౌనం: అఖిలప్రియ


నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ పడే అభ్యర్థి పేరును వెల్లడించాలని ఉన్నప్పటికీ, అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల కారణంగానే ఇప్పటికి ఆ పేరును వెల్లడించలేకపోతున్నానని ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ వ్యాఖ్యానించారు. తాను రేపు, ఎల్లుండి పలు సమావేశాల కోసం విజయవాడలోనే ఉండనున్నానని, ఏదో ఒక సమయంలో సీఎం చంద్రబాబునాయుడిని కలిసి, ఆయనతో మాట్లాడి పేరును ప్రకటిస్తానని ఆమె తెలిపారు.

చంద్రబాబు కూడా తనను కలవాలని ఆదేశించారని, ఆయన్ను కలిసిన తరువాత నంద్యాల టాపిక్ పై మాట్లాడనున్నానని అఖిలప్రియ పేర్కొన్నారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, అభ్యర్థి పేరుపై ఎలాంటి సస్పెన్సూ లేదని, కొంత ఉత్కంఠ భూమా కుటుంబ అభిమానుల్లో మాత్రం ఉందని, దానికి వచ్చే రెండు మూడు రోజుల్లో తెరపడుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News