: అయ్యా.. నన్ను ఒగ్గేయండయ్యా: వర్మకు రాజమౌళి రిక్వెస్ట్
రామ్ గోపాల్ వర్మ సరదాగా పెట్టిన ఓ ట్వీట్ పెద్ద డిస్కషన్ కు దారి తీయడంతో... 'అయ్యా... నన్ను ఒగ్గేయండయ్యా' అంటూ రాజమౌళి రిక్వెస్ట్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే, రాజమౌళి, తాను కలసి ఉన్న ఓ ఫొటోను వర్మ తన ట్విట్టర్లో అప్ లోడ్ చేశాడు. అంతేకాదు దానికి 'బ్యూటీ అండ్ అగ్లీ' అనే క్యాప్షన్ పెట్టాడు. ఆ తర్వాత తాను అగ్లీగా ఉన్నానని, రాజమౌళి మాత్రం అందంగా ఉన్నాడని మరో ట్వీట్ పెట్టాడు. బాహుబలి కంటే కూడా చాలా సెక్సీగా ఉన్నాడంటూ కితాబిచ్చాడు.
ఈ నేపథ్యంలో, ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ మధ్యలో ఎంటరయ్యాడు. మీరిద్దరూ గొప్ప దర్శకులు అనడంలో ఎలాంటి సందేహం లేదని... అయితే, మీ ఇద్దరూ అగ్లీగానే ఉన్నారంటూ ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా, బాబూ మీ అంత, షారుఖ్ ఖాన్ అంత అందంగా అందరూ ఉండలేరంటూ వర్మ రిప్లై ఇచ్చాడు. దీనిపై స్పందిస్తూ, తాను అందంగా ఉంటానన్న విషయం తనకు తెలుసని, షారుఖ్ గురించి మాత్రం చెప్పలేనని కమాల్ అన్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి స్పందిస్తూ, 'అయ్యా నన్ను ఒగ్గేయండయ్యా' అంటూ వేడుకున్నాడు. ఈ సరదా ట్వీట్లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
<blockquote class="twitter-tweet" data-conversation="none" data-lang="en"><p lang="tr" dir="ltr"><a href="https://twitter.com/RGVzoomin">@RGVzoomin</a> Ayyaaa...nannu oggeyyandayyaa....Beauty and the Ugly pic.twitter.com/hKXGGcpfE4
— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2017