: బస్టాప్ వరకూ లిఫ్ట్ ఇమ్మని కోరిన యువతి... సాయం చేసిన యువకుడికి షాక్!


మంచి మనసుతో ఒంటరిగా ఉన్న యువతికి లిఫ్ట్ ఇచ్చి ఆపై షాక్ కు గురయ్యాడో యువకుడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, మాసబ్ ట్యాంక్ వద్ద ఉండే ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంపై హిమాయత్ నగర్ కు బయలుదేరాడు. మధ్య దారిలో ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న ఓ యువతి లిఫ్ట్ అడిగింది. బస్టాప్ వరకూ తనను తీసుకువెళ్లి దించాలని కోరింది. సరేనని చెప్పిన సదరు యువకుడు, అమ్మాయిని ఎక్కించుకుని తీసుకెళ్లాడు.

అయితే, బస్టాప్ వరకూ చేరకుండానే, కాస్తంత దూరంలో బండిని ఆపించి కిందకు దిగిన ఆ అమ్మాయి తన నిజస్వరూపాన్ని చూపింది. వెంటనే డబ్బులివ్వాలని డిమాండ్ చేసింది. లేకుంటే అరచి గోల చేస్తానని బెదిరించింది. అనుకోని ఈ పరిస్థితిలో ఏం చేయాలో తోచని యువకుడు దిక్కులు చూస్తుంటే, సమీపంలోని బస్టాపులో ఉన్న కొందరు గుమికూడారు. అతను విషయం చెబుతుంటేనే, పరిస్థితి తనకు వ్యతిరేకంగా మారుతుందని అనుకుందో ఏమో, ఆ కిలేడీ ఉడాయించింది. దీంతో 'మంచికి పోతే...' సామెతను గుర్తు చేసుకుంటూ, అక్కడి నుంచి బయటపడ్డాడా యువకుడు.

  • Loading...

More Telugu News