: మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తిన మోదీ!
సౌతాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్ కుటుంబాన్ని ప్రధాని మోదీ సంతోషంలో ముంచెత్తారు. రోడ్స్ చిట్టి కుమార్తె జన్మదినం సందర్భంగా 120 కోట్ల భారతీయుల తరపున మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఇండియా! నీకు ఇండియా నుంచి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ మోదీ ట్వీట్ చేశారు. భారత్ మీద ఉన్న అభిమానంతో రోడ్స్ తన చిన్నారికి 'ఇండియా జియాన్నే' అనే పేరు పెట్టుకున్నాడు. మోదీ శుభాకాంక్షలకు రోడ్స్ ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు, ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ మోదీ చేసిన ట్వీట్ ను 12 గంటల వ్యవధిలోనే దాదాపు 6,500 సార్లు రీట్వీట్ చేశారు.