: కృష్ణా జిల్లాలో దారుణం... 15 మంది అమ్మాయిలను మోసం చేసిన ప్రబుద్ధుడు కటకటాల వెనక్కి, వదిలేయాలని నేతల ఒత్తిడి!


ప్రేమించానని చెబుతూ, అమ్మాయిలపై వల వేసి, వారిని నమ్మించి వంచిస్తూ, ఆపై వారి నగ్న చిత్రాలను చూపించి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్న ప్రబుద్ధుడిని పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. ఈ ఘటన కృష్ణా జిల్లా బాపులమాడు మండలంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మండల పరిధిలోని శేరినరసన్నపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడు సుమారు 15 మంది అమ్మాయిలను మోసం చేశాడు. వీరిలో అత్యధికులు కాలేజీ విద్యను అభ్యసిస్తున్నవారే. ఇటీవల ఇతని బెదిరింపులకు తాళలేక, ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయగా, డొంకంతా కదిలింది. హనుమాన్ జంక్షన్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి, ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తుండగా, రాజకీయ నాయకులు కొందరు రంగ ప్రవేశం చేసి, నామమాత్రపు కేసుతో వదిలేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News