: ఇక కురగల్లు, నవులూరు వంతు... అమరావతిలో భూముల కోసం నోటిఫికేషన్
అమరావతి ప్రాంతంలో మరింత భూమిని సేకరించాలన్న లక్ష్యంతో, ఏపీ ప్రభుత్వం రెండు గ్రామాల్లోని భూములపై నోటిఫికేషన్ విడుదల చేసింది. కురగల్లులో 185 ఎకరాలు, నవులూరులో 152 ఎకరాలకు 2013 నాటి భూ సేకరణ చట్టం కింద నోటిఫికేషన్ ఇచ్చింది. రెండేళ్లనాడు అమరావతి నిర్మాణానికి ఈ గ్రామాల వాసులు భూములను ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఇటీవల పెనుమాక, ఉండవల్లి భూముల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, మిగతా గ్రామాల భూములను స్వాధీనం చేసుకునేందుకు కదిలింది. త్వరలో మిగతా గ్రామాల్లో పొలాలను ఇవ్వని రైతులపై భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.