: మోహన్ బాబు, నేను మంచి స్నేహితులం!: సీనియర్ నటుడు గిరిబాబు


నటుడు మోహన్ బాబు, తాను మంచి స్నేహితులమని సీనియర్ నటుడు గిరిబాబు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మోహన్ బాబు, నేను రూమ్ మేట్స్. ఆ తర్వాత మురళీ మోహన్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. మా స్నేహం నలభై ఐదు సంవత్సరాల నాటిది. మా కుటుంబాలు తరచుగా కలుస్తుంటాం.... నేను ఐదేళ్ల పాటు సినిమా కష్టాలు పడ్డాను. మంచినీళ్లు తాగి, అరటిపండు తిని కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అరటిపండ్లు కూడా తినేందుకు ఉండేవి కావు. పస్తులు ఉండాల్సి వచ్చేది. ఆ రోజుల్లో సినిమాల్లో నటించడమంటే అంత తేలిక కాదు. ఎందుకంటే, గాడ్ ఫాదర్స్ ఉంటేనే సినీ రంగ ప్రవేశానికి అవకాశముండేది. అయితే, నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను. ఏ పాత్ర పోషించినా ప్రేక్షకులను మెప్పించాను’ అంటూ గిరిబాబు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News