: మంత్రి పదవి వస్తుందని ఆశించా: బోండా ఉమ
తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించిన మాట వాస్తవమేనని, అయితే రాకపోవడంతో తానేమీ డీలా పడలేదని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మంత్రి వర్గంలో స్థానం వస్తుందని ఆశించిన మాట నిజం. అనేక కారణాల వల్ల పదవి రాలేదు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అయిపోయింది. ఇంకా రెండు సంవత్సరాలు ఉంది. అయితే, మంత్రి పదవికి సంబంధించి ఫస్ట్ లో ఉండే ప్రాముఖ్యతలు వేరు, ఇప్పుడు ఉండే ప్రాముఖ్యతలు వేరు. ఏపీలోని చాలా జిల్లాల నేతలకు మంత్రి పదవులు ఇవ్వలేదు. ఈసారి, ఆయా జిల్లాల నేతలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అనుకోవడం వల్ల మార్పులు చేర్పులు జరిగాయి. దీంతో, మాకు మంత్రి పదవులు దక్కలేదు. అయినా సరే, టీడీపీ మా పార్టీ, చంద్రబాబు గారు మా నాయకుడు .. ఆయన మాటలను కాదనం. రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతుంటాయి’ అని ఉమ చెప్పుకొచ్చారు.