: ఏపీ ఎంసెట్ రూల్ మారింది.. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఫర్వాలేదు.. అనుమతిస్తారు!


ఏపీలో రేపు ఎంసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఫర్వాలేదని, అయితే, సరైన కారణం చెబితే.. వారిని అనుమతిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల విన్నపం దృష్ట్యా, వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. రేపు కాకినాడ జేఎన్ టీయూలో ఎంసెట్ పాస్ వర్డ్ ను విడుదల చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News