: అమ్మాయిలు పుట్టారని తలాక్ చెప్పేశారు!
అమ్మాయిలు పుట్టారనే ఉద్దేశంతో ఇద్దరు మహిళలకు తలాక్ చెప్పిన దారుణ ఘటనలు ఉత్తరప్రదేశ్ లో జరిగాయి. ఈ ఇద్దరు మహిళల్లో ఒకరు జాతీయస్థాయి క్రీడల్లో రాణించి, పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అమ్రోహా ప్రాంతానికి చెందిన షెమైలా జావెద్ జాతీయ స్థాయి నెట్ బాల్ క్రీడాకారిణి. ఆమె ఇటీవలే ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త ఫోన్ ద్వారా తలాక్ చెప్పేశాడు. దీంతో, ఆమె మీడియాను ఆశ్రయించి, తనకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కోరింది.
మరో బాధితురాలు ఆఫ్రీన్ (22) ఆగ్రాలో ఉంటోంది. ఆమెకు కవల ఆడపిల్లలు పుట్టారు. దీంతో ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెబుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ ద్వారా కూడా తలాక్ చెప్పాడు.