: ఖమ్మం, గోదావరిఖనిలో ఇసుక మాఫియా.. అధికార పార్టీ నేతల అండదండలు: ఎమ్మెల్సీ పొంగులేటి
ఖమ్మం, గోదావరిఖనిలో ఇసుక మాఫియా కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఇసుక మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని, ఇసుక ఆదాయం ఎక్కువగా వస్తున్నంత మాత్రాన.. మాఫియా లేదనుకోవద్దని.. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటన తెలంగాణలో జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.