: మరో బాదుడుకు సిద్ధమైన ఎస్బీఐ


ఖాతాదారుల సేవలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అవకాశం ఉన్న ప్రతి చోటా కస్టమర్ల నుంచి డబ్బులు లాగేయడానికి ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రయత్నిస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ. రూ. 2 వేలు కాని, అంతకంటే తక్కువ మొత్తం లావాదేవీలు కానీ చెక్కు ద్వారా జరిపితే రూ. 100 జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి ఈ నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లో ఉందని... అయితే, ఇక నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని తెలిపింది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 

  • Loading...

More Telugu News