: టీఆర్ఎస్.. తెలంగాణ రాబందుల సమితి!: మధుయాష్కీ ధ్వజం


టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి అని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ విమర్శించారు. ఆ పార్టీని మించిన గలీజు పార్టీ మరొకటి లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మాట్లాడుతూ రూ.300 కోట్ల ప్రజా ధనంతో నిర్మించుకున్న బంగ్లాలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులను పరామర్శించే తీరిక కూడా లేకుండా పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారిని రక్షించుకునేందుకు నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో వంద కోట్ల రూపాయల అవినీతి జరిగితే దానికి బాధ్యుడైన మంత్రి కేటీఆర్‌పై చర్య తీసుకోకుండా ఓ అధికారిని సస్పెండ్ చేసి ఊరుకున్నారని పేర్కొన్న యాష్కీ కేసుల భయంతోనే కేసీఆర్ బీజేపీకి దగ్గరవుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News