: బాహుబలిని కట్టప్ప చీకట్లో చంపేశాడు.. నేను చూడలేదు: రానా
ఈ నెల 28న బాహుబలి-2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ చిత్రం నటీనటులు జోరుగా సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానాకి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానం చెబుతూ.. బాహుబలిని కట్టప్ప చీకట్లో చంపేశాడని, ఆ చీకట్లో తనకు ఆ దృశ్యం సరిగా కనిపించలేదని, ఎందుకు చంపాడో తెలియలేదని చమత్కరించారు. అంతకంటే తనకు ఏమీ తెలియదని వ్యాఖ్యానించాడు. వెండితెరపై వెలుతురు ఉంటుందని అందులో చూడాలని ఉచిత సలహా ఇచ్చాడు. బాహుబలి-2లో తనకు అనుష్క యాక్షన్ బాగా నచ్చిందని చెప్పాడు. బాహుబలి-2 సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారని అన్నాడు.