: లోకేశ్‌ కామెడీ చూసి అలసిపోయాం... గూగుల్‌లో పప్పు అని కొడితే కూడా ఆయన ఫొటోనే వస్తోంది: రోజా


అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ రోజు రాత్రి జరిగిన ఓ బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మంత్రిగా 20 రోజుల్లో లోకేశ్‌ చేసిన‌ కామెడీ చూసి అలసిపోయామ‌ని చుర‌క‌లంటించారు. గూగుల్‌లో పప్పు అని కొడితే ముద్దపప్పుతో పాటు లోకేశ్‌ ఫొటో కూడా వస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్ర మంత్రికి జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదని ఆమె ఎద్దేవా చేశారు. అటువంటి వ్య‌క్తిని సీఎం చంద్ర‌బాబు మంత్రిగా చేస్తూ మన రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దారని ఆమె వ్యాఖ్యానించారు. మంత్రి ఎందుకయ్యారంటే తాగునీటి సమస్య సృష్టించడానికే అని లోకేశ్ అంటున్నార‌ని ఆమె అన్నారు

అలాగే సూర్యుడిని అరచేత్తో ఆపలేమ‌ని, ప్ర‌భుత్వం చేసే తప్పులను చూపించే సోషల్ మీడియాను ఆపలేర‌ని రోజా అన్నారు. ఏపీలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లున్నాయో లోకేశ్‌కి తెలియ‌ద‌ని ఏకంగా 200 సీట్లలో గెలుస్తామంటున్నార‌ని ఆమె ఎద్దేవా చేశారు. మ‌రోవైపు చంద్రబాబు త‌మకు 16 శాతం ఆదరణ పెరిగిందని అంటున్నార‌ని, కానీ, ఏ విధంగా పెరిగిందంటే అది చెప్పడం లేద‌ని ఆమె విమ‌ర్శించారు. అసెంబ్లీలో జ‌గ‌న్‌ మైకు ముందు నిలబడితే స‌ర్కారుకి దడ పుడుతోందని రోజా అన్నారు. ఆయన బయట కూడా రైతుల గురించే మాట్లాడతారని, ఎన్నో సార్లు రైతుల స‌మ‌స్య‌లు తీర్చాలంటూ నిరాహార దీక్షలు చేశారని అన్నారు.



  • Loading...

More Telugu News