: రేపు ఏర్పేడు రోడ్డు ప్ర‌మాద‌ బాధితులను ప‌రామ‌ర్శించ‌నున్న జగన్‌


చిత్తూరు జిల్లా ఏర్పేడులో నిన్న లారీ సృష్టించిన బీభ‌త్సం కార‌ణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. మ‌రి కొంద‌రు బాధితులు ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన‌ వారి కుటుంబాలను, గాయపడిన వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పరామర్శించ‌నున్నారు. ఇందుకోసం రేపు జ‌గ‌న్‌ అక్కడికి వెళ్లనున్నట్లు వైసీపీ వ‌ర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News