: వారియర్స్ కు రాయల్ చాలెంజ్


పుణే వారియర్స్ ముందు మరోసారి భారీ లక్ష్యాన్నుంచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. కిందటి సారి ఈ రెండు జట్ల మధ్య బెంగళూరులో మ్యాచ్ జరిగినపుడు క్రిస్ గేల్ సాధించిన రికార్డులు అంత తేలిగ్గా స్మృతి పథం నుంచి చెరిగిపోవు. ఆ మ్యాచ్ లో గేల్ 66 బంతుల్లో 175 పరుగులు చేసి ఐపీఎల్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. కాగా, పుణేలో జరుగుతున్న తాజా పోరులో గేల్ మార్కు మెరుపులు లేకున్నా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 187 పరుగులు చేసింది.

ఓపెనర్లలో గేల్ 21 పరుగులు చేయగా.. తివారీ 51 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో డివిల్లీర్స్ (23 బంతుల్లో 50 నాటౌట్: 6 ఫోర్లు 2 సిక్సులు), హెన్రిక్స్ (13 బంతుల్లో 27 నాటౌట్: 4 ఫోర్లు, 1 సిక్స్) రెచ్చిపోవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. ఇక పుణే బ్యాటింగ్ భారమంతా ఓపెనర్ ఊతప్ప, యువరాజ్ సింగ్, కెప్టెన్ ఫించ్, యువ ఆల్ రౌండర్ స్టీవెన్ స్మిత్ ల రాణింపుపైనే ఆధారపడి ఉంది.

  • Loading...

More Telugu News