: నూరు శాతం అద్భుతం... బాహుబలిపై ట్వీట్ చేసిన యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు!
బాహుబలి మొదటి భాగంతో పోలిస్తే, రెండో భాగం నూటికి నూరు శాతం అద్భుతమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధూ తన సామాజిక మాధ్యమ ఖాతా ట్విట్టర్ ద్వారా స్పందించారు. సినిమా ఫలితంపై మంచి స్పందన వస్తోందని, టాలీవుడ్ కు, ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సమయం దగ్గర పడిందని చెప్పారు. ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ఇప్పటికే పలు దేశాల్లో సెన్సారింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్ర దర్శకుడు రాజమౌళి సహా, హీరో ప్రభాస్, ఇతర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఉమైర్ సంధూ చెప్పిన మాటలు వాస్తవమైతే, తెలుగు చిత్ర సత్తా ప్రపంచానికి మరోసారి తెలిసిరావడం ఖాయం.