: రాజమౌళికి గొప్ప ఊరట...కట్టప్ప క్షమాపణలతో కన్నడలో బాహుబలి-2 ' సినిమా రిలీజ్ కు ఓకే


ప్రముఖ దర్శకుడు రాజమౌళికి గొప్ప ఊరట లభించింది. కట్టప్ప క్షమాపణలు చెప్పని పక్షంలో 'బాహుబలి-2: ది కన్ క్లూజన్' సినిమా విడుదలను అడ్డుకుంటామని కన్నడ సంఘాల సమాఖ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి కన్నడలో తమ సినిమాకు సత్యరాజ్ (కట్టప్ప) కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తూ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కన్నడ సంఘాల సమాఖ్య రాజమౌళి కన్నడలో మాట్లాడినంత మాత్రాన గాయపడిన తమ మనోభావాలకు ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.

దీంతో రంగంలోకి దిగిన సత్యరాజ్ 'బాహుబలి-2: ది కన్ క్లూజన్' లాంటి సినిమా తన కారణంగా విడుదలకు నోచుకోకుండా ఉండకూడదని భావించి...నిన్న క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై నేటి ఉదయం వరకు బెట్టు చేసిన కన్నడ సంఘాల సమాఖ్య...కట్టప్ప క్షమాపణలు చెప్పడంతో 'బాహుబలి-2: ది కన్ క్లూజన్' సినిమా విడుదలను అడ్డుకోమని ప్రకటించారు. అలాగే భవిష్యత్ లో కన్నడిగుల మనోభావాలు కించపరచవద్దని సూచించారు. మరోసారి కన్నడ ప్రజలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని వారు సూచించారు. తాము సత్యరాజ్ కు వ్యతిరేకం కానీ 'బాహుబలి-2: ది కన్ క్లూజన్' సినిమాకు కాదని వారు తెలిపారు. దీంతో 'బాహుబలి-2: ది కన్ క్లూజన్' చిత్ర యూనిట్ హాయిగా ఊపిరిపీల్చుకుంది. 

  • Loading...

More Telugu News