: వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డ రజనీకాంత్ '2.0' విడుదల


రజనీకాంత్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసే విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ సీఓఓ రాజూ మహాలింగం తెలిపారు. రజనీ హీరోగా, అజయ్ దేవగణ్ తదితర ప్రముఖులతో శంకర్ దర్శకత్వంలో రానున్న '2.0' విడుదల వచ్చే సంవత్సరానికి వాయిదా వేసినట్టు ప్రకటించారు. 2010లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'రోబో'కు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా వీఎఫ్ఎక్స్ ను ప్రపంచ స్థాయి నాణ్యతతో తీర్చిదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ముందు అనుకున్నట్టుగా దీపావళికి కాకుండా, జనవరి 25, 2018కి చిత్ర విడుదల వాయిదా వేసినట్టు తెలిపారు. కాగా, ఇక ఈ సంవత్సరం దీపావళి బరిలో నుంచి రజనీ చిత్రం తప్పుకోవడంతో అమీర్ ఖాన్ నటించిన 'సీక్రెట్ సూపర్ స్టార్', అజయ్ దేవగణ్ నటించిన 'గోల్ మాల్ ఎగైన్' పోటీ పడనున్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News