: ఢిల్లీ చేరుకున్న కేసీఆర్.. నేడు, రేపు బిజీబిజీ!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు (శనివారం) ఢిల్లీలో తీరికలేకుండా గడపనున్నారు. శుక్రవారం రాత్రే ఢిల్లీ వెళ్లిన ఆయన నేడు ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఆదివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలోనూ కేసీఆర్ పాల్గొననున్నారు. 2030 విజన్ డాక్యుమెంట్‌పై చర్చ జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలను ఆదుకోవడంతోపాటు వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై మోదీకి వివరించనున్నారు. కాగా, ఢిల్లీ చేరుకున్న కేసీఆర్‌కు విమానాశ్రయంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, తెలంగాణ భవన్ అధికారులు స్వాగతం పలికారు.