: సినీ నటుడు బ్రహ్మాజీ షాకింగ్ ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ మాధ్యమంగా తన కుటుంబానికి చెందిన షాకింగ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన చెప్పిన వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...‘నా కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి గత 5 నెలలుగా విడిపోయి ఉన్నారు. త్వరలోనే విడాకులు తీసుకోనున్నారు. ఈ జంట విడిపోయాక మరో కొత్త జీవితం ప్రారంభించాలని, వారి భవిష్యత్ ఆనందంగా సాగిపోవాలని ఆశీర్వదించండి' అంటూ ట్వీట్ చేశాడు. ఇది టాలీవుడ్, అతని అభిమానుల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారిపోయింది. కాగా, తన కుమారుడు సంజయ్ హీరోగా బ్రహ్మాజీ ఒక సినిమా తీస్తున్నట్టు తెలుస్తోంది.
Sad to inform that my son Sanjay and his wife Indrakshi now separated fr 5 months are getting divorced .wish them happiness and better luck
— BRAHMAJI (@actorbrahmaji) April 21, 2017