: టిమ్మీ ఇప్పుడెలా ఉంది?....అంతా ఓకేనా?: సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్న హర్భజన్ సింగ్ వీడియో...చూడండి


ఐపీఎల్‌ లో ముంబై ఇండియన్స్‌ కీలక బౌలర్ టిమ్ సౌథీతో ప్రయాణంలో చోటుచేసుకున్న సంఘటనను హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇది సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ సందర్భంగా సహచరులతో గడిపే సరదా సంఘటనలను హర్భజన్ వీడియో తీసి సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి, ఆకట్టుకుంటున్నాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టేడియంకు ఆటగాళ్లు బస్సులో వెళ్తుండగా మార్గమధ్యంలో సౌథీ సిబ్బందిని బస్సు ఆపాల్సిందిగా కోరాడు. ఎందుకంటే అతను టాయిలెట్‌ కి వెళ్లాల్సి వచ్చింది.

దీంతో సిబ్బంది వెంటనే బస్సును ఆపడంతో అందుబాటులో ఉన్న వాష్‌ రూమ్‌ కి వెళ్లాడు. దీంతో తన సెల్ ఫోన్ కు పని చెప్పిన భజ్జీ... ఈ తతంగాన్ని వీడియో తీస్తూ... ‘టిమ్మి పరిగెత్తు... లేకపోతే మరో సమస్య రావొచ్చు’ అంటూ సలహా ఇచ్చాడు. తరువాత సహచరులతో 'సౌథీ ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికైనా తెలుసా?' అంటూ ప్రశ్నించాడు. అప్పటికే సౌథీ పరిస్థితికి నవ్వుకుంటున్న వారంతా, భజ్జీ ప్రశ్నతో మళ్లీ నవ్వుకున్నారు. ఇంతలో పని పూర్తి చేసుకొచ్చిన సౌథీతో ‘ఇప్పుడెలా ఉంది టిమ్మి? అంతా బాగానే ఉంది కదా?’ అని అడిగాడు. దీనికి బొటన వేలు చూపిస్తూ ‘అంతా ఓకే' అంటూ సౌథీ సమాధానమిచ్చాడు. దీనిని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News