: ముస్లింలు మాకు ఓటేయకున్నా గౌరవిస్తున్నాం.. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
ముస్లింలు తమకు ఓటేయకున్నా వారికి తగిన గౌరవం ఇస్తున్నట్టు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ దేశాన్ని పాలిస్తున్న తమకు 13 రాష్ట్రాల్లో సొంత ముఖ్యమంత్రులు ఉన్నట్టు తెలిపారు. పరిశ్రమల్లో, ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ఏ ముస్లింను కూడా తాము వేధింపులకు గురిచేయలేదని పేర్కొన్నారు. ఏ ఒక్క ముస్లింను ఉద్యోగం నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు. బీజేపీకి వారు ఓటేయకున్నా వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.