: కేసీఆర్ కారణ జన్ముడు.. కాబట్టే తెలంగాణను సాధించగలిగారు: కేశవరావు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కారణ జన్ముడని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు కొనియాడారు. కొంపల్లిలో నిన్న జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ కారణ జన్ముడు కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాటం రాష్ట్ర సాధనతో ముగిసిపోలేదని అన్నారు. పేదలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ ఉద్యమానికి సార్థకత వస్తుందని పేర్కొన్న కేశవరావు, ఇప్పుడు కేసీఆర్ అదే పనిలో ఉన్నారని తెలిపారు.