: ఓ సర్‌ప్రైజ్‌ విషయం చెబుతాం: ఆసక్తిరేకెత్తిస్తోన్న బన్నీ ‘డీజే’ మూవీ యూనిట్ ప్రకటన


స్టైలిష్ స్టార్‌ అల్లుఅర్జున్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న ‘దువ్వాడ జగన్నాథమ్‌’ (డీజే) సినిమా యూనిట్ ఈ రోజు బ‌న్నీ అభిమానులంద‌రిలోనూ ఎంతో ఆస‌క్తి రేకెత్తించింది. ఈ సినిమాకి సంబంధించి ‘ఓ సర్‌ప్రైజ్‌ విషయం రేపు(శనివారం) చెబుతాం.. వేచి ఉండండి’.. అంటూ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో డీజే టీమ్ పేర్కొంది. దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఆ ఆసక్తిక‌ర విష‌యం ఏమై ఉంటుంద‌బ్బా? అంటూ చ‌ర్చ మొద‌లైంది. ఆ స‌ర్ ప్రైజ్ విష‌యం ఏంటో తెలుసుకోవాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. ఈ సినిమాను వచ్చే నెల 19న విడుదల చేయనున్నారు.  



  • Loading...

More Telugu News