: బీజేపీ వాళ్లు నా నకిలీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు: మమతా బెనర్జీ
తన నకిలీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారని, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని భారతీయ జనతా పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించారు. తృణమూల్ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిగా మమత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తూ సోషల్మీడియాలో దుష్ప్రచారం చేయిస్తోందని అన్నారు. తాను గొడ్డు మాంసం తింటున్నానని ఆ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని ఆమె చెప్పారు. తాను దేశంలో ఏ ప్రాంతంలో పర్యటించినా తనను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు తమ కార్యకర్తలను పంపిస్తున్నారని ఆయన అన్నారు.