: రైలులో 18 పిస్తోళ్ల బ్యాగును వదిలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి!
రైలులో ఓ గుర్తు తెలియని వ్యక్తి 18 పిస్తోళ్లతో ఉన్న ఓ బ్యాగ్‌ను వదిలి వెళ్లిన ఘటన సీల్దా- బలియా ఎక్స్‌ప్రెస్‌లో వెలుగు చూసింది. బలియా స్టేషన్లో రోజువారీ సోదాల్లో భాగంగా సాధారణ బోగీలోని బెర్తు కింద స్పోర్ట్స్ బ్యాగ్ కనిపించిందని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. ఆ బ్యాగును తెరచిచూస్తే అందులో పద్దెనిమిది పిస్తోళ్లు కనిపించాయని చెప్పారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.