: 13 ఏళ్ల క్రితం దైవదూష‌ణ చేసిన వ్య‌క్తిని కాల్చి చంపిన అక్కాచెల్లెళ్లు!


పాకిస్థాన్‌లో 13 ఏళ్ల క్రితం దైవదూషణ చేసిన ఓ వ్య‌క్తిని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇప్పుడు ప‌ట్టుకొని తుపాకుల‌తో కాల్చి చంపేశారు. తాము ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డానికి గ‌ల కార‌ణాలు ఆ అక్కాచెల్లెళ్లు వివ‌రించి చెబుతూ... 2004లో ఫాజల్‌ అబ్బాస్‌ (45) అనే వ్యక్తి దైవదూషణ చేశాడ‌ని, అయితే, తాము అప్ప‌ట్లో చిన్న‌పిల్ల‌లం కావ‌డంతో అత‌డిని హ‌త‌మార్చ‌లేక‌పోయామ‌ని చెప్పారు. దైవ దూష‌ణను నేరంగా భావించే పాకిస్థాన్‌లో అప్పట్లో అతనిపై కేసు నమోదైంది. అనంత‌రం ఆయ‌న‌ పాకిస్థాన్‌ వీడి బెల్జియం వెళ్లాడు. తాజాగా ఆయ‌న పాకిస్థాన్‌కి వ‌చ్చాడు. అదే అత‌డి పాలిట శాపంగా మారింది. అత‌డు మ‌ళ్లీ తిరిగొచ్చాడ‌ని తెలుసుకున్న ఆ అక్కాచెల్లెళ్లు అబ్బాస్‌ ఇంటికి వెళ్లి, ఆయ‌న‌ను కలవాలని ఆయన తండ్రితో చెప్పారు. ఇంట్లో నుంచి అబ్బాస్‌ బయటకు రాగానే త‌మ‌ బురఖాలో దాచిన తుపాకీలను ఒక్క‌సారిగా తీసి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆనందంతో ఆ అక్కాచెల్లెళ్లు దైవదూషకుడికి శిక్ష విధించామని నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News