: ఏర్పేడు ఘోర రోడ్డు ప్రమాదంలో 20కి చేరిన మృతుల సంఖ్య
చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో ఈ రోజు మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. అక్కడి పూతల పట్టు- నాయుడు పేట రహదారిలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని దుకాణాలపైకి ఒక్కసారిగా లారీ దూసుకురావడంతో అక్కడి జనమంతా పరుగులు పెట్టారని స్థానికులు చెప్పారు. లారీ సృష్టించిన బీభత్సంతో అక్కడ విద్యుదాఘాతం కూడా చోటుచేసుకుందని, షాక్ కొట్టడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రులకి చేరుస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.