: చిత్తూరులో ఘోర ప్రమాదం.. బీభత్సం సృష్టించిన లారీ...15 మంది మృతి
చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో ఈ రోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి పూతల పట్టు- నాయుడు పేట రహదారిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో అదుపుతప్పిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా అక్కడి దుకాణాలపైకి దూసుకెళ్లికింది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో పూతల పట్టు-నాయుడు పేట రహదారిలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన స్థానికులు పలు వాహనాల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.