: సోషల్ మీడియాకు చంద్రబాబు, లోకేశ్ భయపడుతున్నారు: అంబటి రాంబాబు
సోషల్ మీడియా అంటే చంద్రబాబు, లోకేష్ లు భయపడుతున్నారని, అందుకు నిదర్శనం ఫేస్ బుక్ పేజీ ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ రవికిరణ్ ను అరెస్టు చేయడమేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. రవికిరణ్ కు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా అంబటి తెలిపారు. సోషల్ మీడియాకు సంకెళ్లు వేయాలనుకోవడం పిచ్చితనం అని, మీడియాను లోబర్చుకున్న చంద్రబాబు, సోషల్ మీడియాను తన అదుపులోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.