: బిడ్డను ప్రసవించిన నాలుగు నెలలకు కోమాలోంచి బయటకు వచ్చి బిడ్డను చూసిన పోలీసు అధికారిణి


2016 నవంబర్ 1న అమేలియా బన్నన్ (34) అనే అర్జెంటీనా మహిళా పోలీసు అధికారిని, తన భర్త, పోలీసు అధికారైన తన భర్త, సహోద్యోగులతో కలిసి సర్వీసు వాహనంలో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అయితే అప్పటికే గర్భవతి అయిన ఆమె ప్రసవానికి ఆలస్యం కాకుండా వైద్యులు చర్యలు తీసుకున్నారు. దీంతో కోమాలో ఉండగానే నాలుగు నెలల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. గత కొన్ని రోజులుగా చిన్నచిన్న మార్పులు సంభవించడం గుర్తించిన వైద్యసిబ్బందిని, గురువారం అకస్మాత్తుగా కోమాలోంచి బయటకు వచ్చి ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. అనంతరం తన బిడ్డను చూసుకుని మురిసిపోయారు. ఆమె కోమాలోంచి బయటకు రావడంతో వారి బంధువులు ఆనందంలో మునిగిపోయారు. 

  • Loading...

More Telugu News