: నారా లోకేష్ పై ఫేస్ బుక్ లో అసభ్యకర పోస్టులు... పోలీసుల అదుపులో ఇంటూరి రవికిరణ్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన అమరావతి ప్రాంత వాసి ఇంటూరి రవికిరణ్ ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేష్ పై ఫేస్ బుక్ పోస్టులను చూసిన మండలి చైర్మన్ చక్రపాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశామని తెలిపారు. గతంలోనూ కిరణ్, నారా లోకేష్ లక్ష్యంగా పలు పోస్టులను పెట్టాడని తెలిపారు. ఆయన్ను శంషాబాద్ లో అరెస్ట్ చేశామని, నేడో, రేపో కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు.