: పట్టాలు తప్పిన హైదరాబాద్ ప్యాసింజర్... హెల్ప్ లైన్ నెంబర్లివి!
హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ మధ్య నడిచే హైదరాబాద్ ప్యాసింజర్, ఈ ఉదయం కర్ణాటకలో పట్టాలు తప్పింది. కల్గూపూర్ - బీల్కీ మధ్య రైలు ప్రమాదవశాత్తూ పట్టాలు తప్పిందని, ఇంజన్, దాని వెనుక రెండు బోగీలు పట్టాలు తప్పాయని, ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో, ఈ మార్గంలో మిగతా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను దారిమళ్లించినట్టు అధికారులు వెల్లడించారు. ఇక ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ లో 040-23200865, పర్లీలో 02446-223540, వికారాబాద్ లో 08416-252013, బీదర్ లో 08482-226329 ఫోన్ నంబర్లతో కూడిన హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.