: ములాయంసింగ్ యాదవ్ నివాసంలో అగ్నిప్రమాదం.. బయటపడిన కరెంటు బిల్లుల వ్యవహారం!
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ నివాసంలో జరిగిన చిన్న అగ్నిప్రమాదం ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు వచ్చిన విద్యుత్ సిబ్బంది పవర్ కనెక్షన్‌లో తేడాను గమనించారు. అధికారికంగా 5 కిలోవాట్లకు తీసుకున్న కనెక్షన్ స్థానంలో 40 కిలోవాట్ల కనెక్షన్ ఉండడంతో కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన అనంతరం కనెక్షన్‌ను 40 కిలోవాట్లకు మార్చారు. అలాగే ములాయంసింగ్ యాదవ్ రూ.4 లక్షలకు పైగా కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు గుర్తించారు. దీంతో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకు ఆయనకు గడువిచ్చారు.