: ఎర్రబుగ్గలు తొలగించేందుకు పోటీలు పడుతున్న ముఖ్యమంత్రులు!
నేతల కార్లపై ఎర్రలైట్లు తీసేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రముఖులందరూ తమ కార్లపై ఉన్న ఎర్ర బుగ్గలను తొలగించేస్తున్నారు. ఎర్ర బుగ్గలు తొలగించేందుకు మే 1 వరకు సమయం ఉన్నప్పటికీ నిర్ణయం వెలువడినప్పటి నుంచే వాటిని తొలగించేస్తున్నారు. పలు రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు, అధికారులు పోటీలు పడి మరీ వాటిని స్వయంగా తొలగిస్తున్నారు. గురువారం ఢిల్లీ హైకోర్టు జడ్జిలందరూ సమావేశమై తమ వాహనాలపై ఉన్న ఎర్ర లైట్లను తొలగించాలని తీర్మానించారు. మరోవైపు తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా, గుజరాత్, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా తమ కార్లకున్న ఎర్రలైట్లను తొలగించారు. మంత్రులు, అధికారుల వాహనాలపై ఎర్రబుగ్గల వాడకాన్ని నిషేధిస్తూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.