: అల్లుడు చెప్పాడు.. బాలకృష్ణ చేసి చూపించారు..: రోజా ఎద్దేవా


ఏపీ మంత్రి లోకేశ్ పైన, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ‌పైన వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు. గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన రోజా.. లోకేశ్ మంత్రి పదవి చేపట్టాక ఆయన కామెడీ జబర్దస్త్‌ను దాటేసిందన్నారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని తీసుకొస్తానంటూ అల్లుడు లోకేశ్ చెప్పగానే ఆయన మామ బాలకృష్ణ హిందూపురంలో దానిని అమలుచేసి చూపించారని ఎద్దేవా చేశారు. లోకేశ్ చెప్పినట్టుగానే తండ్రి, మామ నియోజకవర్గాలైన కుప్పం, హిందూపురంలో నీళ్లు దొరకడం లేదన్నారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని సృష్టించేందుకే లోకేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యారని తీవ్రస్థాయిలో విమర్శించారు. లోకేశ్ మాట్లాడే ప్రతి మాటలోనూ తప్పులు దొర్లుతున్నాయని, సోషల్ మీడియా ఆయన మాటలను పోస్ట్ చేస్తుంటే దానిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News