: డౌన్‌లోడ్ స్పీడ్‌లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో


డౌన్‌లోడ్ స్పీడ్‌లో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. టెలికాం మార్కెట్లో ఉచిత ఆఫ‌ర్ల‌తో సంచ‌ల‌నం క‌లిగించిన జియో త‌మ వినియోగ‌దారుల‌కి నాణ్య‌మైన సేవ‌ల‌ను అందించ‌డంలోనూ అదే దూకుడు క‌న‌బరుస్తోంది. ట్రాయ్ తాజాగా విడుద‌ల చేసిన‌ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో డౌన్‌లోడ్ స్పీడులో ఇత‌ర అన్ని టెలికాం కంపెనీల కన్నా ముందు స్థానంలో నిలిచింది. 16.48 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో జియో మార్చిలో కూడా మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, ఈ స్పీడు ఐడియా సెల్యులార్, భారతీ ఎయిర్‌టెల్ స్పీడ్ కంటే దాదాపు రెండు రెట్ల‌ని ఆ నివేదిక‌లో పేర్కొన్నారు. ఐడియా సెల్యులార్ స్పీడ్‌ 8.33 ఎంబీపీఎస్ తో రెండో స్థానంలో నిల‌వ‌గా భారతీ ఎయిర్‌టెల్ 7.66 ఎంబీపీఎస్, వొడాఫోన్ 5.66, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 2.64, టాటా డొకొమో 2.52, బీఎస్ఎన్ఎల్ 2.26, ఎయిర్‌సెల్ 2.01 ఎంబీపీఎస్ వేగంతో జాబితాలో ఆ త‌రువాత ఉన్నాయి.

  • Loading...

More Telugu News