: అరుణాచల్ ప్రదేశ్ లో ప్రతి అంగుళం భారత్ కే చెందుతుంది: వెంకయ్య నాయుడు
అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు ప్రాంతాలకు చైనా దేశం తమ పేర్లు పెట్టుకున్న సంఘటనపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అరుణాచల్ ప్రదేశ్ లో ప్రతి అంగుళం భారత్ కే చెందుతుందని, మన దేశంలోని నగరాలకు వారి పేర్లు పెట్టుకునే హక్కు ఏ దేశానికి లేదని అన్నారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు ప్రాంతాలకు వోగియాన్ లింగ్, మిలారి, క్వోడియాన్ గార్బోరి, మెయిన్ క్యుకా, బ్యుమోలా, నమ్కాపబ్ రి పేర్లను చైనా పెట్టడం విదితమే. అంతేకాకుండా, ఈ పేర్లను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది.